అంబరానికి అంటేలా

అంబరానికి అంటేలా

లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా (2)
అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం (2)
సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం (2)        ||లాల||

దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు
దీనులను రక్షించే దేవ తనయుడు (2)
దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె
విజయ వీరుడై ఉద్భవించెనే (2)
పశుల పాకలో పరుండియుండెనే         ||లాల||

ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే
లోకానికి రక్షకుడు వెలిసెనని (2)
తార వెంబడి వెళ్లి వారు
కానుకలర్పించి ఆరాధించారు (2)
ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి         ||లాల||

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే (2)
పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు
దూత గణములే జోల పాడగా (2)
సృష్టికి బహు సంబరమాయెగా         ||లాల||