అందాలతార
అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార||
విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార||
యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు ||అందాల తార||
ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే బాలునిజూడ జీవితమెంత పావనమాయెను ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన ||అందాల తార||