అపరాధిని యేసయ్యా
అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా (2) నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు (2)
సిలువకు నిను నే గొట్టి తులువలతో జేరితిని (2) కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా (2)
ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే (2) మిక్కిలి బాధించితిని మక్కువ జూపితి వయ్యో (2)
ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని (2) కౄరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా (2)
చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత (2) అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా (2)