ఈమె పేరు ఇరెనా సెండ్లర్. 2008 మే 1298 ఏళ్ల వయస్సులో పోలెండ్‌లోని వార్సాలో ఈమె కనుమూశారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో, వార్సాలోని నాజీల గ్యాస్ చాంబర్‌లో మురికినీటి గొట్టాలను అతికించే నిపుణురాలిగా పనిచేయడానికి ఇరెనా అనుమతి పొందింది. ఈ పని చేయడంలో ఆమెకు మరొక ఉద్దేశం ఉంది.
తను మోసుకెళ్లిన పనిముట్ల పెట్టె అడుగు భాగంలో, నాజీల చిత్రహింసల శిబిరాలలో ఉంటున్న యూదు శిశువులను దాపెట్టిన ఇరెనా, వారిని అలా ఆ శిబిరాలనుంచి నాజీలకు తెలియకుండా తరలించేది. మరింత పెద్ద వయసు పిల్లలను తరలించడానికి తన ట్రక్ వెనుకన ఆమె ఒక గోనె సంచిని పెట్టుకుని వెళ్లేది.
నాజీ సైనికులు చిత్రహింసల శిబిరంలోకి ఆమెను అనుమతించి, బయటకు పంపుతున్నప్పుడు ఇరెనా తన వెంట ఒక కుక్కను తీసుకెళ్లి అది ఆ సమయాల్లో మొరిగేలా దానికి శిక్షణ ఇచ్చింది.
సైనికులు తమ ముందు మొరుగుతూ వెళ్లే ఈ కుక్కను ఏమీ చేసేవారు కారు. కుక్క మొరుగుడు ఇరెనా తరలిస్తున్న శిశువులు చేసే శబ్దాలు బయటకు రాకుండా అడ్డుకునేది.
ఇలా ఆమె 2500 మంది యూదు శిశువులను అప్పట్లో గ్యాస్ చాంబర్ల నుంచి బయటకు తరలించగలిగింది.
చివరకు ఒక రోజు ఆమె పట్టుబడింది. నాజీలు ఆమె కాళ్లూ చేతులూ విరిచి చితకబాదారు.
ఇలా తను తరలించిన శిశువుల పేర్ల చిట్టాను తన ఇంటి పెరడు లోని ఒక చెట్టు కింద గ్లాస్ జాడీలో పెట్టి భద్రపర్చింది ఇరెనాయుద్ధం ముగిసిన తర్వాత ఈ పిల్లల తల్లిదండ్రులలో ఎవరైనా బతికి ఉంటే వారిని కనుక్కునేందుకు  ఆమె ప్రయత్నించింది. పిల్లలను వారి కుటుంబాలతో కలిపేందుకు కూడా ప్రయత్నించింది.కాని పిల్లల తల్లిదండ్రులలో చాలామంది గ్యాస్ ఛాంబర్లకు బలయ్యారు. ఆమె కాపాడిన పిల్లలను క్రైస్తవ శరణాలయాలు స్వీకరించాయి లేదా దత్తత తీసుకున్నాయి.ఇరెనా చేపట్టిన సాహసిక చర్యకు ఇప్పుడు 65 ఏళ్లు. యూరప్‌లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 65 ఏళ్లయింది.

60 లక్షల మంది యూదులు, 2 కోట్ల మంది రష్యన్‌లు, కోటి మంది క్రైస్తవులు, 1,900 మంది కేథలిక్ ప్రీస్ట్‌లు ఈ యుద్ధంలో చంపబడ్డారు, ఊచకోతకు గురయ్యారు. రేప్ చేయబడ్డారు, తగులబెట్టబడ్డారు, పస్తులతో చంపబడ్డారు, అవమానించబడ్డారు.