ఎంత దూరమైనా
ఎంత దూరమైనా అది ఎంత భారమైనా (2) యేసు వైపు చూడు నీ భారమంత తీరు (2) తీరానికి చేరు (2) ||ఎంత||
నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా (2) కలువరి గిరి దనుక సిలువ మోసిన నజరేయుడేసు నీ ముందు నడవగా (2) ||యేసు||
తెలిసి తెలిసి జారిపోయినావా తెలియరాని చీకటిలో చిక్కుబడినావా (2) నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా (2) ||యేసు||